Search
Close this search box.

  క్లాస్ డైరెక్టర్ తో మాస్ మహారాజా..?

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో జోరు మీదున్నాడు. ఇప్పటికే ‘మాస్ జాతర’ అనే సినిమా ఆగస్టు 27న విడుదల కానుండగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా 2026 సంక్రాంతికి విడుదలయ్యేలా షూటింగ్ జరుపుకుంటోంది.. అలాగే, ‘మ్యాడ్’ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో మరో కొత్త ప్రాజెక్ట్ డిసెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది..ఇప్పటికే రెండు సినిమాలు చేయడం ఖరారు చేసిన రవితేజ, తాజాగా మూడో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ చెప్పిన కథ రవితేజను బాగా నచ్చిందట.. ఆయన వెంటనే ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్నట్టు సమాచారం.. అధికారిక ప్రకటన త్వరలో రానుందని అంచనాలు ఉన్నాయి..‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి విజయవంతమైన ప్రేమకథా చిత్రాలతో పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ, తర్వాత ‘టక్ జగదీష్’ను ఓటీటీలో రిలీజ్ చేశారు..అనంతరం వచ్చిన ‘ఖుషి’ చిత్రం థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేదు..

ఇక మరోవైపు, శివ నిర్వాణ ఇటీవల రామ్ పోతినేనికి కూడా ఓ కథ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే రవితేజకు చెప్పిన కథే అది అదేనా…? వేరే కథనా.? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఏది అయినా శివ నిర్వాణ – రవితేజ కాంబినేషన్ పక్కా అయితే, మాస్‌తో పాటు ఎమోషన్ కలగలిసిన ఓ కొత్త ప్రయోగం తెలుగు ప్రేక్షకులకు అందనుంది.. చూడాలి మరి రవితేజా మాస్ , శివ నిర్వాణ క్లాస్ ఎలా ఉండబోతుందో చూడాలి..

 

 

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు