Search
Close this search box.

  ప్యారడైజ్ లో వేశ్య పాత్రలో బ్లాక్ బస్టర్ హీరోయిన్..?

కయాదు లోహార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అప్పట్లో శ్రీ విష్ణుతో కలిసి నటించిన అల్లూరి చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో, తమిళ సినిమాపై దృష్టి సారించి అక్కడ “రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్” అనే సినిమాలో నటించింది. ఆ సినిమా తెలుగులో కూడా విడుదలై రెండు భాషల్లోనూ బ్లాక్‌బస్టర్ హిట్గా నిలిచింది.ఇప్పటికే అందాలతో పాటు నటనలో కూడా ఆకట్టుకునే నైపుణ్యం ఉన్న కయాదు, ప్రస్తుతం తెలుగులో మంచి స్క్రిప్టులను ఎంచుకుంటూ సరైన కం బ్యాక్‌కి సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, నాని హీరోగా నటిస్తున్న పారడైజ్ చిత్రంలో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు కానీ, ఆమె ఎంపిక దాదాపుగా ఖరారయినట్లే..ఈ సినిమాలో కయాదు వేశ్య పాత్రలో కనిపించనుందని ఇండస్ట్రీ టాక్. నిజానికి ఈ కథలో హీరో తల్లి పాత్ర కూడా వేశ్య పాత్రేనట. కథ ప్రకారం, ఓ వేశ్యవాటికలో పుట్టి పెరిగిన యువకుడే కథానాయకుడు. ఈ నేపథ్యంలో కయాదు పాత్ర కూడా చాలా బోల్డ్‌గా ఉండనుంది. నటనకు ఛాలెంజ్ ఉన్న ఈ పాత్ర ఆమె కెరీర్‌కు ఒక టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశముంది..ఇక మరోవైపు, విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఫంకీ అనే చిత్రంలో కూడా కయాదు హీరోయిన్‌గా నటిస్తోంది. ఒకే సమయంలో రెండు భిన్నమైన చిత్రాల్లో భాగమవుతుండటంతో, కయాదు స్టార్ హీరోయిన్‌గా ఎదిగే అవకాశాలు మరింత బలపడుతున్నాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు