Search
Close this search box.

  ఇండియన్ 3 మళ్ళీ వస్తుందా..?

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లెజెండరీ సినిమాల్లో “ఇండియన్” ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది. మాస్టర్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించగా, అంచనాలు ఆకాశాన్ని తాకాయి..అయితే, ఇటీవల విడుదలైన “ఇండియన్ 2” మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది..భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది..ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాల నుంచి కూడా ఈ సినిమా ఫెయిల్యూర్‌గా గుర్తించబడింది.. శంకర్ ఈ సినిమా తీసినందుకు భారీ విమర్శలు ఎదుర్కొన్నాడు.. శంకర్ తో పాటు కమల్ హాసన్ కూడా విమర్శలు ఎదుర్కున్నాడు.. ఈ సినిమాతో లైకా ప్రొడక్షన్స్ కు కూడా భారీ లాస్ వచ్చింది..ఈ సినిమా తరువాత ఇండియన్ 3 మూవీ వాయిదా పడింది..కానీ ఈ చిత్రం రిలీజ్ కాకముందే పార్ట్ 3 కూడా ఫిక్స్ చేశారని టాక్ వినిపించింది..ఇప్పుడీ విషయంపై కొత్తగా రూమర్స్ ఊపందుకున్నాయి. తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం, “ఇండియన్ 3″పై ఇంకా మేకర్స్ పని కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.. మరికొన్ని పార్ట్‌లు, ఒక పాట షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని అంటున్నారు. .మధ్యలో “ఇండియన్ 3 డైరెక్ట్‌గా ఓటిటీలోకి వస్తుందట,” “పూర్తిగా ఆపేశారట” వంటి ఊహాగానాలపై శంకర్ క్లారిటీ ఇచ్చినట్టు చెబుతున్నారు..ఇప్పుడు ఈ సినిమాపై మళ్లీ చర్చ మొదలవడంతో, ఇది నిజంగా వస్తుందా? లేక మరోసారి వాయిదా పడుతుందా? అన్నది వేచి చూడాల్సిందే..మరి ఇండియన్ 3 ఎలా ఉండబోతుందో చూడాలి..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు