దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమాల్లో చాలా వరకూ ఒకే సినిమాటోగ్రాఫర్ పేరు కనిపిస్తుంటుంది – ఆయనే కె.కె. సెంథిల్ కుమార్. ఇప్పటివరకు రాజమౌళి తీసిన 12 చిత్రాల్లో 8 సినిమాలకు సెంథిల్ డీఓపీగా పనిచేయడం విశేషం. అయితే తాజాగా మహేష్ బాబుతో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాకు సెంథిల్ పనిచేయడం లేదని, వీరి మధ్య విభేదాలున్నాయంటూ సోషల్ మీడియాలో రూమర్లు వెల్లివిరిశాయి.అయితే, తాజాగా సెంథిల్ స్వయంగా స్పందిస్తూ ఆ వార్తలపై ముగింపు పలికారు.“ఇది సహజం, గొడవలేం లేవు” – సెంథిల్ క్లారిటీజూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా తెలుగువన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సెంథిల్ మాట్లాడుతూ> “రాజమౌళి గారు వేరే సినిమాటోగ్రాఫర్‌తో పని చేయడం ఇదే తొలిసారి కాదు. ‘మర్యాద రామన్న’కి రామ్ ప్రసాద్, ‘విక్రమార్కుడు’కి సర్వేశ్ గారు పనిచేశారు. అన్ని సినిమాలకూ నేనే చేయాలి అన్న నిబంధన ఉండదు. కొన్ని ప్రాజెక్ట్స్‌కి వేరే స్టైల్ ట్రై చేయాలనుకోవడం సాదారణం. మాకు మధ్య ఎలాంటి గొడవలూ లేవు” అని క్లారిటీ ఇచ్చారు.









