కామెడీ హారర్ జానర్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘ముని’ సిరీస్, ‘కాంచన’ ఫ్రాంచైజీగా ఎదుగుతూ కోలీవుడ్‌లో సూపర్ హిట్ సిరీస్‌గా మారింది. మల్టీటాలెంటెడ్ హీరో, స్వీయదర్శకుడు రాఘవ లారెన్స్ నటిస్తున్న ఈ సిరీస్ నాల్గో సినిమా ఇప్పుడు అధికారికంగా అనౌన్స్ అయింది.ఈ చిత్రం పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ శరవేగంగా ముగుస్తోంది, మూడు షెడ్యూల్స్ పూర్తయిన సమాచారం అందుతోంది. సైలెంట్‌గా చివరి పనులు పూర్తి చేసి త్వరలో విడుదల చేయనున్నారు.ఈ సినిమాలో పూజా హెగ్డే కూడా కీలక పాత్రలో నటిస్తోంది. రిలీజ్ తేదీ త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నదని వార్తలు వస్తున్నాయి. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయని భావిస్తున్నారు.









