Search
Close this search box.

  బాలీవుడ్ రామాయణ నుండి కాజల్ అవుట్..? మరో క్రేజీ హీరోయిన్..?

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో రాబోతున్న భారీ బడ్జెట్ సినిమా ‘రామాయణ’ రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది..తాజాగా ఈ సినిమా మొదటి భాగానికి సంబంధించిన ఒక గ్లింప్ వీడియో విడుదల చేయగా, ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేసే ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది..ఈ సినిమాలో రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటిస్తుండగా, సీతగా సాయి పల్లవి కనిపించబోతున్నారు.. అలాగే, రావణాసురుడిగా కేజిఎఫ్ స్టార్ యశ్ నటిస్తుండటం విశేషం..ముందుగా రావణాసురుడి భార్య, మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ నటించబోతున్నట్టు చెప్పినప్పటికీ, ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. కాజల్ స్థానంలో మృణాల్ ఠాకూర్ ఈ పాత్రను చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై చిత్ర బృందం అధికారికంగా స్పందించలేదు..కాజల్ పెళ్లి తర్వాత అందుబాటులో ఉన్న సినిమాల్లో ప్రధాన పాత్రలకు బదులు చిన్న పాత్రలు వచ్చిన కారణంగా ఈ చిత్రం నుంచి తప్పుకున్నారని భావిస్తున్నారు. అలాగే యశ్ పాత్ర కూడా 15 నిమిషాల స్థాయిలో మాత్రమే ఉంటుందని తెలుస్తోంది..రణబీర్ కపూర్ రాముడిగా నటించడం పట్ల వచ్చిన విమర్శలపై దర్శకుడు నితీష్ తివారీ స్పందించారు.. రణబీర్ ముఖంలో ఉన్న ప్రశాంతత రాముడి పాత్రకు సరిపోయేలా ఉంటుందని, అందుకే ఈ పాత్రకు ఆయనను ఎంపిక చేశామని తెలిపారు..అంతేకాదు, రణబీర్ కపూర్ ఈ సినిమాలో సుమారు 150 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని సమాచారం..ఈ సినిమా దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు సమాచారం..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు