తెలుగు ప్రేక్షకులు ఇద్దరు హీరోలు – నందమూరి బాలకృష్ణ మరియు విక్టరీ వెంకటేశ్ ఓ మల్టీస్టారర్ సినిమాలో కలిసి నటించబోతున్నారని అధికారికంగా ప్రకటించారు.. ఈ క్రేజీ కాంబినేషన్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది..అమెరికాలో జరుగుతున్న NATS 2025 వేడుకల్లో పాల్గొన్న వెంకటేశ్, అభిమానులతో చిట్‌చాట్ చేస్తూ ఈ శుభవార్తను ప్రకటించారు.”త్వరలోనే బాలయ్యతో కలిసి స్క్రీన్ మీద కనిపించనున్నాను,” అని ఆయన చెప్పడంతో, ఈ కాంబినేషన్‌పై ఉన్న ఊహాగానాలకు తెరపడింది..ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ 2’ షూటింగ్‌లో ఉన్నారు. అనంతరం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ కొత్త సినిమా చేయనున్నారు.. ఇందులో వెంకటేశ్ కీలక పాత్ర పోషించే అవకాశాలున్నట్టు సమాచారం..
ఇక మరోవైపు, వెంకటేశ్ ఇప్పటికే చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు బాలయ్యతో ప్రాజెక్ట్ ఖరారవ్వడంతో తెలుగు సినిమాలో మల్టీస్టారర్ ట్రెండ్ మరింత ఊపందుకోనుంది..ఈ భారీ కాంబినేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి..









