యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘వార్ 2’.. వార్ మూవీ సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది..ఈ సినిమాలో ఎన్టీఆర్ స్పై ఎజెంట్ గా కనిపిస్తాడని సమాచారం..ఇప్పుడు ఈ సినిమా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయగా, కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ఈ భారీ సినిమా నిర్మిస్తుండగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు..ఈ బిగ్ యాక్షన్ ఎంటర్టైనర్ 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది.. అయితే ఈ సినిమా గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..వార్ 2 విడుదలపై యష్ రాజ్ ఫిల్మ్స్ విపరీతమైన స్థాయిలో ప్లాన్ చేస్తోంది.. ఇండియన్ సినిమా చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ చూడని విధంగా, ఈ సినిమాని సుమారు 9,000 స్క్రీన్స్లో విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారట..ఇంతవరకు అత్యధిక స్క్రీన్ కౌంట్ సాధించిన సినిమా రజనీకాంత్ ‘రోబో 2.O’ అది 7,500 స్క్రీన్‌లకు పైగా విడుదలైంది. ఇప్పుడు వార్ 2 ఆ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది..తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది.. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, సితార ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత నాగవంశీ ఈ సినిమా తెలుగు హక్కులను రూ. 50 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది..దీనికి గల కారణం ఎన్టీఆర్ అని తెలుస్తుంది.. ఎన్టీఆర్ పై ఉన్న నమ్మకంతో ఈ సినిమాను ఆ ధరకు తీసుకున్నట్లు తెలుస్తుంది..డిస్టిబ్యూషన్‌లో ఒక భారీ డీల్‌గా నిలవనుంది..ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి మాస్, క్లాస్ హీరోలు కలిసి నటించటమే కాదు, వారి మధ్య కెమిస్ట్రీ, యాక్షన్ సీక్వెన్సెస్‌పై ఇప్పటికే సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాతో ఇండియన్ స్పై యూనివర్స్‌కి ఒక నెక్స్ట్ లెవెల్లో
చూపించబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు..వార్ 2 తో ఎన్టీఆర్ బాలీవుడ్‌లో తన సత్తా మరోసారి నిరూపించనున్నారు..అంచనాలు ఇలా ఉంటే, బాక్సాఫీస్ దగ్గర ఇది ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి..ఇదే రోజు సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కూలీ కూడా రిలీజ్ కాబోతుంది.. చూడాలి మరీ కూలీ, వార్ 2 మధ్య పోటీ ఎలా ఉండబోతుందో..









