Search
Close this search box.

  ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ పై అప్డేట్ ఇచ్చిన ప్రియాంక చోప్రా..! జక్కన ప్లాన్ అదుర్స్..!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.. ప్రముఖ ఆంగ్ల మీడియాతో ఆమె చేసిన ఇంటర్వ్యూలో, ఈ సంవత్సరం ఒక భారతీయ సినిమాలో నటించబోతున్నానని పేర్కొనడం తెలుగు సినీ ఆడియన్స్ లో ఆసక్తి రేపింది.. ఆమె నటించబోయే సినిమా ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ కావచ్చని భావిస్తున్నారు నెటిజన్స్ అనుకుంటున్నారు.మహేశ్ బాబు హీరోగా, దర్శక ధీరుడు ss. రాజమౌళి కాంబో వస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాలో ప్రియాంక ఓ కీలక పాత్ర పోషించనున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి..
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఫారెస్ట్ నేపథ్యంతో సాగే ఈ థ్రిల్లర్‌ను రాజమౌళి ఇంటర్నేషనల్ రేంజిలో రూపొందిస్తున్నారు.. మహేశ్ బాబు ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్ లో కనిపించబోతున్నట్లు
సమాచారం.. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్ పూర్తి అయినట్లు సమాచారం.. ఈ సినిమా తర్వాత షెడ్యూల్లో మేజర్ పార్ట్ షూట్ చేయబోతున్నట్లు సమాచారం..అందుకోసం ఓ భారీ సెట్ ను నిర్మిస్తున్నారు..ఇంటర్వ్యూలో తన బాల్యాన్ని గుర్తుచేసుకున్న ప్రియాంక – “నేను థియేటర్‌లో చూసిన తొలి సినిమా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన బొంబాయి..ఆ అనుభవం ఇప్పటికీ నా మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇండియాను, ఇక్కడి సినిమాలను బాగా మిస్ అవుతున్నాను. ఈ సంవత్సరం ఓ భారతీయ సినిమాలో భాగమవుతుండడం పట్ల చాలా ఎగ్జైట్‌మెంట్‌గా ఉంది. భారతీయ ప్రేక్షకులు చూపించే ప్రేమకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని తెలిపారు.ఈ వ్యాఖ్యలు ఆమె మళ్లీ భారతీయ సినిమాల్లోకి అడుగుపెడుతున్న సంకేతాలుగా భావిస్తున్నారు. నిజంగానే ఆమె ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’లో నటిస్తే, మహేశ్-ప్రియాంక కాంబినేషన్ తెరపై చూడటానికి ఫ్యాన్స్ ఎదురు చూస్తుండవచ్చు. ఇక ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిని దాటి, పాన్ వరల్డ్ రేంజ్‌లో దూసుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు