‘అ!’, ‘కల్కి’, ‘జాంబీ రెడ్డి’ లాంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్లాడు.. ఇప్పుడు ఆ విజయం తాలూకు సీక్వెల్ ‘జై హనుమాన్’ కోసం రెడీ అవుతున్నాడు..ప్రశాంత్ వర్మ కేవలం దర్శకుడిగానే కాకుండా, రచయితగా కూడా తన సినిమాటిక్ యూనివర్స్ ను విస్తరిస్తున్నాడు. ఇందులో భాగంగా రూపొందుతున్న ప్రాజెక్ట్‌ల్లో ఒకటి ‘అధీర ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కల్యాణ్ ను హీరోగా పరిచయం చేస్తూ, ఈ సినిమా మొదట ప్రశాంత్ దర్శకత్వంలోనే రూపొందాల్సి ఉండింది. కానీ ‘హనుమాన్’ అద్భుత విజయంతో, ప్రశాంత్ తన ప్రాధాన్యతలను మళ్లించి ‘అధీర’ దర్శకత్వ బాధ్యతలను ‘తిమ్మరుసు’ ఫేమ్ శరణ్ కొప్పిశెట్టికు అప్పగించినట్టు సమాచారం..ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో మరో హైలైట్ ఏంటంటే – ఇందులో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించనున్నారని టాక్. ప్రస్తుతం నాగార్జున కమర్షియల్ హీరోగా కాకుండా, విభిన్న పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రయోగాలు చేస్తున్నారు.. ఇటీవల కుబేర’ లో విభిన్న పాత్రలో మెప్పించగా, త్వరలో రిలీజ్ కానున్న ‘కూలీ’లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు..ఇప్పుడు ‘అధీర’ లోనూ నాగార్జున ఓ పవర్‌ఫుల్ రోల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇది నిజమైతే, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌కు నాగార్జున లాంటి స్టార్ యాక్టర్ జాయిన్ అవడం, ఈ ప్రాజెక్ట్‌కి మాస్ ప్లస్ క్లాస్ ఎలివేషన్ తీసుకొచ్చే అంశం..చూడాలి మరి కింగ్ ఏ పాత్రలో కనిపిస్థాడో..









