తమిళ స్టార్ హీరో సూర్యతో దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న భారీ సినిమా ప్రస్తుతం టాలీవుడ్,. కోలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ సినిమాలతో వెంకీ అట్లూరి తన టేకింగ్, న్యారేషన్‌తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు..ఇప్పుడు సూర్యతో కలిసి చేస్తున్న సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సందర్భంగా వెంకీ అట్లూరి ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికర వివరాలు పంచుకున్నారు.వెంకీ అట్లూరి చెప్పిన ప్రకారం, ఈ సినిమాలో సూర్య కొత్తగా కనిపించబోతున్నారు.. ఇప్పటివరకు ఆయన చేసిన పాత్రలకు భిన్నంగా, ఈసారి సూర్య ఒక ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ఇది గజినీ’లోని సంజయ్ రామస్వామి తరహా పవర్‌ఫుల్ రోల్‌గా ఉంటుందని ఆయన తెలిపారు..అలాగే ఈ సినిమాలో గమ్మత్తైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ప్రధాన ఆకర్షణగా ఉంటాయని వెంకీ చెప్పాడు. తమిళ, తెలుగు మార్కెట్ దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశాడు..ఇటీవల విడుదలైన సూర్య రెట్రో స్టైల్ మూవీ తెలుగులో ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, తమిళనాట మంచి స్పందనను తెచ్చుకుంది. అయితే ఇప్పుడు వెంకీ అట్లూరితో చేస్తున్న ఈ మల్టీలాంగ్వేజ్ ప్రాజెక్ట్‌తో మళ్లీ బ్లాక్‌బస్టర్ దిశగా అడుగులు వేస్తాడనే భారీ నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు..ఇదిలా ఉండగా, వరుస హిట్లతో జోష్‌లో ఉన్న వెంకీ అట్లూరి – సూర్య కాంబినేషన్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది..!









