అఖిల్ అక్కినేని, శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా లెనిన్.. ఈ సినిమా లో అఖిల్ ఇప్పటికీ వరకు చేయని ఓ కొత్త క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు.. ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. ఈ సినిమా నుండి హీరోయిన్ శ్రీలీల తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది.. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో శ్రీలీల ఈ సినిమా తప్పుకున్నట్లు సమాచారం.. తెలుగు ప్రేక్షకులకి ‘పెళ్లి సందడి’తో పరిచయమైన శ్రీలీల, ఆ చిత్రం పెద్ద విజయం సాధించకపోయినా, ఆమెకు అవకాశాలు మాత్రం వరుసగా వచ్చాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల పక్కన నటించే అవకాశాలు దక్కించుకుంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఆమె పలు ప్రాజెక్టుల్లో చేసింది.. ‘గుంటూరు కారం’ వంటి సినిమాల్లో నటించింది. ఇదే క్రమంలో, అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న ‘లెనిన్’సినిమాలో ఆమె హీరోయిన్గా ఎంపికయ్యారు అన్న వార్తలొచ్చాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం, కొన్ని ప్రత్యేక కారణాల వల్ల శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది..శ్రీలీల తప్పుకున్న తర్వాత ‘లెనిన్’ టీమ్ భాగ్యశ్రీ బోర్స్ ను రంగంలోకి దింపింది.. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె, మొదటి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ‘కింగ్డమ్’ సినిమాలో ఆమె హీరోయిన్గా నటిస్తోంది. ఇది కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణమే..దాంతో, అదే బ్యానర్ నుంచి వస్తున్న ‘లెనిన్’లో భాగ్యశ్రీకి అవకాశం రావడం లాజికల్ మూవ్‌గా భావించబడుతోంది. త్వరలో ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది..









