Search
Close this search box.

  రివ్యూవర్స్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్..!

మంచు విష్ణు హీరోగా నటిస్తు ,అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా ‘కన్నప్ప’ ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. ఐతే ఈ సినిమా సోషల్ మీడియాలో జరుగుతున్నా ట్రోలింగ్ పై మంచు విష్ణు స్పందించారూ..ఈ ప్రాజెక్ట్ చుట్టూ నెగటివ్ ప్రచారం, ట్రోలింగ్‌ ఎక్కువవుతోంది. రెండు సంవత్సరాలుగా కసరత్తులు చేస్తూ ఎంతో శ్రమతో రూపొందించిన ఈ సినిమాపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుండడంతో, మంచు విష్ణు చివరకు తీవ్రంగా స్పందించారు..తాజాగా, ఆయన నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ తరఫున ఒక హెచ్చరిక నోటీస్ విడుదల చేస్తూ – అసత్య ఆరోపణలు, నెగటివ్ రివ్యూలు చేసిన వారికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

> “కన్నప్ప’ సినిమా ప్రజలను ఆకట్టుకోవడమే కాకుండా, భక్తిభావంతో ముంచేలా రూపొందించాం. ఎవరు సినిమా గురించి రివ్యూ ఇవ్వాలనుకుంటే, ముందు పూర్తిగా చిత్రాన్ని వీక్షించాలి. ఆ తరువాత, దాని ఉద్దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకొని, బాధ్యతాయుతంగా స్పందించాలి. వ్యతిరేక ధోరణితో, వ్యక్తిగత విమర్శలతో స్పందిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.”..ఈ హెచ్చరిక నోటీసు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

> “సృజనాత్మక ప్రక్రియపై ఉద్దేశపూర్వక దాడులు చేయడం, ట్రోల్ చేయడం, వ్యక్తిగత విమర్శలకు దిగడం అంగీకరించలేం. ఇందుకు తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని పేర్కొన్నారు.

అంతేకాకుండా, సినిమా లీక్ చేయడం, ప్రమాణాలు లేని విమర్శలు చేయడం, ప్రయోజనాల కోసం సినిమాను దూషించడం వంటి విషయాలపై సివిల్, క్రిమినల్ మరియు సైబర్ చట్టాల కింద చర్యలు తీసుకుంటామని స్పష్టంగా హెచ్చరించారు…

‘కన్నప్ప’ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది..

ఇది భారీ బడ్జెట్‌తో, రూపొందిన ప్రాజెక్ట్ అని చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బజ్‌ను పెంచుకుంటూ వస్తున్న ఈ సినిమాపై విడుదలకు ముందు ఈ విధమైన అధికారిక వార్నింగ్ ఇస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్, మోహన్ లాల్ లాంటి స్టార్స్ కీలక రోల్స్ చేస్తున్నారు..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు