Search
Close this search box.

  నాగ చైతన్య ల్యాండ్ మార్క్@25 మూవీ డైరెక్టర్ ఫిక్స్..! ఎవరంటే..?

అక్కినేని నాగ చైతన్య తన సినీ కెరీర్ లో ఈ మరో మైల్ స్టోన్ చేరేందుకు సిద్ధమవుతున్నారు.. ఆయన కెరీర్‌లో 25వ సినిమాగా తెరకెక్కబోయే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.. ప్రతి హీరో తన కెరీర్ లో 25 వ సినిమా అనేది ల్యాండ్ మార్క్ గా భావిస్తారు.. అందుకని ఆ సినిమా చేసేటప్పుడు గత సినిమాల్లో జరిగిన తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా జాగ్రత్తగా చేస్తారు.. ఐతే నాగ చైతన్య కూడా ఇప్పుడు అదే రూట్లో వెళ్తున్నట్లు సమాచారం.. నాగ చైతన్య ల్యాండ్ మార్క్ మూవీని ఎవరితో చేస్తారు..

గత కొంత కాలంగా ఈ సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఎవరు అన్న ప్రశ్న సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వస్తుంది..ఐతే ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది అనిపిస్తుంది..గతంలో ఆయనకు బిగ్గెస్ట్ హిట్ అందించిన ‘మజిలీ’ డైరెక్టర్ శివ నిర్వాణ మరోసారి నాగ చైతన్యతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి..ఈ ప్రాజెక్ట్‌కి స్పెషల్ గా మారనున్నట్టు సమచారం..ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది..ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు ఫుల్ స్పీడ్‌లో సాగుతున్నాయి. శివ నిర్వాణ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారని సమాచారం. కథ, పాత్రల ప్రణాళికపై ఆయన శ్రద్ధ చూపుతున్నట్లు తెలిసింది..‘మజిలీ’ తర్వాత మళ్లీ ఈ డైరెక్టర్-హీరో కాంబినేషన్ రిపీట్ అవుతున్నందున, అభిమానులు, ఇండస్ట్రీలో మంచి హైప్ ఏర్పడింది.. ఈ సినిమా ఓ భావోద్వేగభరితమైన యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని ఇండస్ట్రీ టాక్..అన్ని పూర్తయిన తర్వాత ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది..నాగ చైతన్య 25వ సినిమా కావడం, మరోసారి సక్సెస్ ఫుల్ కాంబో రిపీట్ కావడం… ఈ ప్రాజెక్ట్‌కు ఫుల్ హైప్

తీసుకువస్తుంది.. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృంద వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు