Search
Close this search box.

  “ఈ నగరానికి ఏమైంది” సీక్వెల్ సిద్ధం..! ఈసారి ఫ్యాన్స్ డబల్ ఫెస్టివల్..?

‘పెళ్లిచూపులు’ సినిమాతో డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు తరుణ్ భాస్కర్.. తన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఈ సినిమా మొదట థియేటర్లలో అనుకున్నంతగా స్థాయిలో. ఆడకపోయినా… ఓటీటీ, టీవీలో యూత్ ఫేవరెట్‌గా మారింది.. రియలిస్టిక్ కథనం, అదిరగొట్టే డైలాగ్స్‌తో, ఫుల్ ఫన్ తో ఈ సినిమా కల్ట్ క్లాసిక్‌గా మారింది…గత ఏడాది రీరిలీజ్ కి థియేటర్లలో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.. ఫుల్ సెలబ్రేషన్స్, ఇంటెన్స్ రియాక్షన్స్ చూసినవాళ్లంతా షాక్ అయ్యారు.. ముఖ్యంగా విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను నటన, పాత్రలు సోషల్ మీడియాలో మీమ్స్‌గా మారాయి..

ఇప్పుడు, ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందన్న వార్తలు ఆడియెన్స్ లో భారీ హైప్ ను క్రియేట్ చేస్తుంది.. . తాజాగా, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ స్క్రిప్ట్ రెడీ అయ్యిందని హింట్ ఇచ్చిన తరవాత… విశ్వక్ సేన్‌తో కలిసి మళ్లీ పనిచేయబోతున్నారని సమాచారం.ఇక జూన్ 29న ఈ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇదే రోజున ‘ఈ నగరానికి ఏమైంది’కి 7 ఏళ్లు పూర్తవుతుండడం విశేషం. స్పెషల్ డేట్‌కి స్పెషల్ అనౌన్స్‌మెంట్‌తో డబుల్ ఫెస్టివల్ మన ముందుకు రాబోతోంది.ఈసారి మరింత క్రేజీగా తెరకెక్కబోతున్న ఈ సీక్వెల్ బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయిలో దూసుకెళ్తుందో చూడాలి..!

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు