Search
Close this search box.

  స్పిరిట్ లో తమిళ స్టార్..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి సాలిడ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘స్పిరిట్’ అనే సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది పూర్తిగా ఓ పవర్‌ఫుల్ పోలీస్ బ్యాక్‌డ్రాప్‌ స్టోరీగా రూపొందనుంది. ఇక ప్రభాస్‌ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్లబోతుందా, ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..ఈ మూవీకి సంబంధించిన పనులు స్టార్ట్ అయినట్టు సమాచారం.. సంగీతం పరంగా హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే ఆల్బమ్‌ పనులను స్టార్ట్ చేశారట.. గతంలో ‘అర్జున్ రెడ్డి’, ‘అనిమల్’ వంటి సినిమాల్లో సందీప్ రెడ్డి వంగా అందించిన స్టోరీ టేకింగ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్న నేపథ్యంలో ‘స్పిరిట్’ కూడా విభిన్నంగా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది..ఇక ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటించబోతున్న విషయం ఇప్పటికే బయటకు వచ్చింది.. అయితే తాజా సమాచారం ప్రకారం సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ స్పెషల్ క్యారెక్టర్‌ను కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.. ఆ పాత్ర కోసం ఓ తమిళ నటుడిని తీసుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.. కానీ ఆ హీరో ఎవరు అన్నది ఇంకా రివీల్ చేయలేదు. త్వరలో దీనిపై క్లారిటీ రానుందని భావిస్తున్నారు..ఈ భారీ ప్రాజెక్ట్‌ను టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ కలిసి గ్రాండ్‌గా నిర్మించనున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సినిమా కథ వేరేలా ఉండబోతోందని ఫిల్మ్ సర్కిల్స్‌ చెప్పుకుంటున్నాయి. ఓ మాస్ హీరోను ఓ త్రిల్ జానర్‌లో చూపించాలనుకునే ప్రయత్నమే ఈ ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. దీంతో సందీప్ రెడ్డి మరోసారి ప్రేక్షకుల్ని థియేటర్లకు ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడని చెప్పవచ్చు..

 

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు