హిందీ, తెలుగు, తమిళం అంటూ భాషలు తేడా లేకుండా , వరుస సినిమాలతో దూసుకుపోతున్న నటి సంయుక్త కి మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైన్‌లో పడింది..విజయ్ సేతుపతి హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందనున్న మల్టీలాంగ్వేజ్ సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించనున్నారు..
ఈ సినిమాను పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి, చార్మి
నిర్మిస్తున్నారు.. కీలక రోల్ లో నటి టబు తో పాటు ,రాధిక ఇప్పటికే ప్రాజెక్ట్‌లో పార్ట్ కాగా, తాజాగా సంయుక్తా కూడా కాస్టింగ్‌లో చేరింది.. ఈ సినిమా నుండి ఐన విడుదల చేసిన పోస్టర్‌లో “ఆమె నడకలో హుందాతనం.. కళ్లలో ఆగ్రహం” అంటూ ఆమె పాత్రను పరిచయం చేశారు మేకర్స్..
ఇది ఒక పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందనుండగా, విజయ్ సేతుపతి ఈ సినిమాలో తన కెరీర్‌లో ఇంతవరకు చేయని విభిన్న పాత్రలో కనిపించబోతున్నాడు..త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.. ఇక ఈ సినిమాకి టైటిల్‌గా ‘బెగ్గర్’ అనే పేరు పెట్టబోతున్నట్లు సమాచారం..
ప్రస్తుతం సంయుక్తా తెలుగులో ‘అఖండ 2: తాండవం’, స్వయం భూ సినిమా లతో పాటు తమిళంలో లారెన్స్ తో కలిసి ‘బెంజ్’, హిందీ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. అన్ని ఇండస్ట్రీలలోనూ సినిమాలు చేస్తూ తనకంటూ ఓ క్రేజ్‌ను కొనసాగిస్తోంది..