Search
Close this search box.

  డ్రిల్ మాస్టర్ గా మెగాస్టార్..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ఎంటర్‌టైన్‌మెంట్ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ భారీ ఎంటర్టైనర్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే..ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి..ఇక ఈ సినిమా నుండి రోజుకో రూమర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అప్పట్లో ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ కీలక రోల్ చేస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి..

ఐతే ఇప్పుడు ఈ సినిమా నుండి మరో న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ సినిమాలో మెగాస్టార్ డ్రిల్ మాస్టర్ పాత్రలో కనిపించబోతున్నట్లు న్యూస్ చక్కర్లు కొడుతుంది..ఈ సినిమాలో చిరంజీవి ఎప్పటికీ గుర్తుండిపోయే విభిన్న పాత్రలో కనిపించబోతున్నాడు..ఆయన ఒక స్కూల్‌లో డ్రిల్ మాస్టర్ గా కనిపించనున్నాడు.. అనిల్ రావిపూడి ఇప్పుడు చిరును వినూత్నంగా చూపించేందుకు ప్లాన్ చేస్తున్నాడు..సినిమాకి గ్లామర్ తారగా నయనతార నటిస్తోంది. షూటింగ్ ముస్సోరీ లో జోరుగా సాగుతోంది.. చిరంజీవి, నయనతార, కేథరిన్ థ్రెసా మధ్య కీలక నా సన్నివేశాలను డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు..ఈ సినిమాలో వింటేజ్ చిరుగా సందడి చేయబోతున్నట్లు తెలుస్తుంది..

ఆయన స్టైల్, హ్యూమర్, డాన్స్ మరోసారి ప్రేక్షకులను అలరించనున్నాయని ఆశిస్తున్నారు..

ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి..ఈ సినిమాకు సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాను 2026 సంక్రాంతి బరిలోకి దించనున్నట్టు ప్రకటించడంతో, షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు