Search
Close this search box.

  విలన్ గా కింగ్..? సెట్ అవుతుందా..?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్యూర్ యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్‌తో ఫుల్ ప్యాక్డ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉండబోతుందన్న మేకర్స్ మాటలతో ఫ్యాన్స్‌లో హైప్ పెరిగిపోతోంది..ఈ సినిమాలో కీలక రోల్స్ లో కొందరు స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు.. ముఖ్యంగా అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. అయితే, నాగార్జున ఏ పాత్రలో కనిపిస్తారన్నది ఫాన్స్ లో ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. తాజాగా నాగ్ ఈ సస్పెన్స్‌ను బ్రేక్ చేశారు.. తాను నటిస్తున్న ‘కుబేర’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడుతూ,

 

> “లోకేశ్ కథ చెప్పకముందే, నేరుగా – ‘నీవు విలన్ పాత్ర చేస్తావా?’ అని అడిగారు. కథ విన్న మొదటి పదే నిమిషాల్లోనే నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను,”

> అని నాగార్జున వెల్లడించారు.నాగ్ విలన్‌గా కనిపించబోతున్నారని తెలిసి ఫాన్స్ ఆశ్చర్యంతో పాటు ఆహ్లాదంగా కూడా స్పందిస్తున్నారు. ఆయన విలన్ షేడ్‌లోని పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ఓ స్పెషల్ హైలైట్ అవుతుందంటూ చిత్ర యూనిట్ చెబుతోంది..శ్రుతి హాసన్, సత్యరాజ్ వంటి వారు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం అందిస్తున్నది యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్.. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..

చూడాలి మరి విలన్ గా నాగ్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాడో..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు