Search
Close this search box.

  నాగ్ సెంచరీ సినిమా డైరెక్టర్ ఫిక్స్..? ఎవరంటే..?

టాలీవుడ్‌లోకి ఎ.ఎన్.ఆర్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న హీరో కింగ్ నాగార్జున..  చాలా మంది హీరోలు జీవితాంతం హీరోగానే నటించాలని కోరుకుంటారు కానీ, నాగార్జున మాత్రం, అన్ని రకాల పాత్రలు చేయడం ద్వారా సింగిల్ డైమెన్షనల్ హీరో కాకుండా సంపూర్ణ నటుడిగా మారాలని భావిస్తున్నారు..కానీ గత కొంత కాలంగా నాగార్జున సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతా పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి… దీంతో ఆయన తాజాగా హీరో పాత్ర కాకుండా సపోర్టివ్ రోల్స్‌లో కూడా నటించడం ప్రారంభించారు.. ఇప్పటికే శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్ హీరోగా వస్తున్న ‘కుబేర’ సినిమాలో సపోర్ట్ రోల్ చేస్తున్నాడు..  ఈ సినిమా ఈ నెల 20న రిలీజ్ అవుతుంది.. మరియు లోకేష్ డైరెక్షన్లో రజనీ కాంత్ హీరోగా వస్తున్న ‘కూలీ’  సినిమాలో కూడా ఒక కీలక రోల్ లో చేస్తున్నాడు కింగ్ నాగార్జున..  ఈ రెండు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో నాగార్జున పాత్ర  ఎంతో హైలైట్ అవుతుందనీ, రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియోలు సినిమాపై అంచనాలు పెంచాయి..ఇక, నాగార్జున ఈ సపోర్టివ్ పాత్రల్లోనే ఉండకుండా  మళ్లీ హీరోగా కూడా నటించనున్నట్లు సమాచారం..ప్రస్తుతం ఆయన 99వ సినిమా పూర్తి చేసి, 100వ సినిమా పై పెద్ద అంచనాలు ఏర్పడుతున్నాయి. 100వ చిత్రాన్ని ఒక స్టార్ డైరెక్టర్ కాకుండా, కొత్త ఆలోచనలతో కూడిన, కొలీవుడ్  దర్శకుడితో చేయబోతున్నాడు.. కార్తీక్ అనే డైరెక్టర్ తో తన 100 వ సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది.., ఆయన దర్శకత్వంలోని ‘ఆకాశం’ సినిమా పెద్ద హిట్ కాకపోయినా.. నాగార్జున కోసం ఓ మంచి కథ రెడీ చేసినట్లు సమాచారం..  ఆ కథ నాగ్ కు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం..ఈ 100వ సినిమా జూలైలో ఫైనల్ షెడ్యూల్‌తో మొదలవుతుందని తెలుస్తోంది.. చూడాలి మరి నాగ్ 100వ సినిమా ఎలా ఉండబోతుందో..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు