పెళ్లి సందడి సీక్వెల్ సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినా, సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ తన కెరీర్‌ను సాలిడ్ లైన్ అప్ తో సెట్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది..వరుస సినిమాల జోలికి పోకుండా, కథలు మరియు అవకాశాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు..ప్రస్తుతం రోషన్ మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్‌తో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అంతేగాక, ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమాస్ బ్యానర్‌పై మరో సినిమా కూడా రూపొందుతోంది. ఇవన్నీ నిర్మాణ దశలో ఉన్నాయి..పెళ్లి సందడి 2లో రోషన్ సరసన నటించిన శ్రీలీల ఇప్పటికే అరడజను పైగా సినిమాల్లో నటించి బిజీగా మారిపోయింది. కానీ రోషన్ మాత్రం ప్రతి ప్రాజెక్ట్ ఎంపికలో స్పష్టతతో, ఓ పద్ధతితో ముందుకెళ్తున్నాడు. ఇప్పటి వరకూ ఆయన నుండి ఒక్క సినిమాకూడా విడుదల కాలేదు… తాజాగా రోషన్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హిట్ సిరీస్ తో గుర్తింపు పొందిన దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటించబోతున్నాడు. ఈ సినిమాను నాని తన నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించనున్నాడు. నిర్మాతగా సితార నాగవంశీ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నారు..హిట్ 3 రిలీజ్ సమయంలో శైలేష్ కొలను, “తర్వాత ఓ లవ్ స్టోరీ చేయాలనుంది” అని చెప్పిన మాటల వెనక ఉన్న అర్థం ఇప్పుడు బయటపడింది. అంటే అప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిగినట్టే..ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. నటీనటులు, టెక్నికల్ టీం వంటి విషయాల్లో చర్చలు జరుగుతున్నాయి. త్వరలో అధికారికంగా వివరాలు వెలువడే అవకాశం ఉంది..









