Search
Close this search box.

  హరిహర వీరమల్లు మరోసారి వాయిదా..! రిలీజ్ ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా ‘హరిహర వీరమల్లు’.. ఈ సినిమా గత 4 సంవత్సరాలుగా సెట్స్ పై ఉంది.. ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది… ఎట్టకేలకు ఈ సినిమా జూన్ 12న విడుదల చేయాలని భావించిన చిత్ర బృందం, అనివార్య కారణాల వల్ల మరోసారి విడుదలను ముందస్తుగా నిలిపివేసింది.. దీంతో ఈ సినిమా రిలీజ్ పై పలు ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుండో వెయిట్ చేస్తున్నారు..

ఈ నేపథ్యంలో, సినిమా జూన్ 26 లేదా జూలై మొదటి వారంలో విడుదల కావచ్చని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలపై స్పందించిన మెగా సూర్య ప్రొడక్షన్స్ స్పష్టతనిచ్చింది..తమ అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా విడుదల చేసిన ప్రకటనలో, “సినిమా విడుదల తేదీపై ప్రస్తుతం నడుస్తున్న వార్తలు అసత్యం. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎలాంటి ఊహాగానాలనూ నమ్మవద్దు. త్వరలోనే మా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నిజమైన విడుదల తేదీని తెలియజేస్తాం. మీ మద్దతు, అభిమానం యథావిధిగా కొనసాగించాలని కోరుకుంటున్నాం,” అని పేర్కొంది..

 

ఈ సినిమాకి ప్రారంభంలో దర్శకుడు క్రిష్ మెగా ఫోన్ పట్టినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి క్రిష్ తప్పుకున్నాడు.. తర్వాత దాని బాధ్యతలు నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ తీసుకున్నారు.. షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు, ఆర్థిక ఒత్తిడి పెరగడంతో పవన్ కల్యాణ్ తన పారితోషికాన్ని తిరిగి ఇచ్చినట్లు సమాచారం.

ఆ తరువాత పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాకి డేట్స్ కుదరలేదు.. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ షూటింగ్ ఫినిష్ డబ్బింగ్ కూడా పూర్తి చేశారు.. ఒక చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు…

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు