ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లో బయోపిక్ సినిమాల హవా కొనసాగుతుంది.. కొందరి గొప్ప వాళ్ళ జీవితాలను సినిమా రూపంలో తెరకెక్కిస్తున్నారు..ఈ బయోపిక్ లు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ అవ్వడంతో .. బయోపిక్ సినిమాలకు గిరాకీ బాగా పెరిగింది.. ఈ సినిమాలు చూసేందుకు ఆడియన్స్ కూడా థియేటర్స్ పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ చూపడంతో బయోపిక్ సినిమాలు భారీగా రూపొందుతున్నాయి.. ప్రస్తుతం మరో బయోపిక్ తెరపైకి రానుంది..భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఇప్పుడు వెండితెరపై కనిపించనుంది.. ‘కలాం’ పేరుతో తెరకెక్కనున్న ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌లో జాతీయ ధనుష్ టైటిల్ రోల్‌లో నటించబోతున్నారు. ఈ సినిమాను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అధికారికంగా ప్రకటించడమే కాకుండా, టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర భాగస్వామిగా ఉండటం తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని కలిగిస్తోంది…ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ దాకా కలాం చేసిన స్ఫూర్తిదాయక ప్రయాణం అద్భుతంగా ప్రతిబింబించనుంది. రాకెట్ శాస్త్రవేత్తగా, కవిగా, ఉపాధ్యాయుడిగా, ప్రజల రాష్ట్రపతిగా ఆయన జీవితం “వింగ్స్ ఆఫ్ ఫైర్” ద్వారా ఎన్నో తరాలకు మార్గదర్శిగా నిలిచింది..దీనిపై దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ,
“కలాం గారి జీవితం కేవలం బయోపిక్ మాత్రమే కాదు. ఇది ఒక తత్వం, ఒక మార్గదర్శకం. ఈ కథ ద్వారా ప్రపంచ యువతకి, ముఖ్యంగా గ్లోబల్ సౌత్‌కు ఓ గొప్ప సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను..ఈ సినిమా ధనుష్ నటనా ప్రతిభతో, ఓం రౌత్ దర్శకత్వం, భారత సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి..









