పవన్ కళ్యాణ్ అభిమానులకు నిజంగా డబుల్ ఫెస్టివల్ ఫీల్ ఇస్తున్నాయి.. గతకొంతకాలంగా పవన్ కళ్యాణ్ డేట్స్ బిజీగా ఉండటం వల్ల హరిహర వీరమల్లు’ సినిమా వాయిదాలు పడుతూ వస్తున్నా విషయం అందరికీ తెలిసిందే.., ఇప్పుడు రీస్టార్ట్ అయ్యి షూటింగ్ పూర్తయ్యింది.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో జూన్ 12న విడుదల కాబోతుంది.. ఈ అప్డేట్ విన్న మెగా ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం వెల్లివిరిసింది…ఇక మరోవైపు, OG కూడా పవన్ ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ కు మరో హై పాయింట్. సుజిత్ దర్శకత్వంలో, డీవీవీ నిర్మాణంలో వస్తున్న ఈ యాక్షన్ డ్రామా స్టైలిష్, ఇంటెన్స్ థ్రిల్లర్‌గా ఉంటుందని టాక్.. పవన్ OG సెట్స్ లో అడుగుపెట్టిన తాజా సమాచారం ప్రకారం, ముంబై షెడ్యూల్ పూర్తికాగానే చిత్ర బృందం విడుదల తేదీని ఫిక్స్ చేయనుంది..
దసరా (సెప్టెంబర్) సీజన్ టార్గెట్ చేస్తూ OGని తీసుకురావాలనే ప్లాన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది నిజంగా సెట్ అయితే జూన్ లో హరిహర వీరమల్లు,
సెప్టెంబర్ లో ఓజీ అంటే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒకే ఏడాదిలో రెండు భారీ సినిమాలు – నిజంగా ఓ పండుగే అని చెప్పాలి.. OG ముంబై షెడ్యూల్ మాత్రమే.. అది పూర్తి అయిన వెంటనే అధికారిక రిలీజ్ డేట్ వస్తుందన్న మాట.









