Search
Close this search box.

  జూన్ 1నుండి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్..! ఎందుకంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో కీలక పరిణామం వెలుగు చూసింది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్ ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. జూన్ 1 తేదీ నుంచి థియేటర్లను మూసివేయనున్నట్లు ప్రకటించారు.. దీనికి గల కారణాలు రెంటల్ సిస్టమ్‌ను తక్షణమే విరమించాలని డిమాండ్ చేస్తున్న ఎగ్జిబిటర్లు, థియేటర్లను నడపడం ఇప్పటికే భారంగా మారిందని చెబుతున్నారు.. సినిమా వసూళ్లలో వాటా ఇస్తేనే థియేటర్లు కొనసాగుతాయని తేల్చిచెప్పారు..హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్ల ప్రతినిధులతో పాటు ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, డి. సురేష్ బాబు కూడా హాజరయ్యారు.. ఈ సమావేశంలో ఎగ్జిబిటర్లు తమ ఆర్థిక ఇబ్బందులను వివరించి, అద్దె పద్ధతిలో థియేటర్లు నడిపడం సాధ్యం కాకపోతున్నదని వివరించారు..

“థియేటర్ల నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అద్దె విధానంతో రోజురోజుకీ నష్టాల్లో కూరుకుపోతున్నాం. ఇకపై మా డిమాండ్ పర్సంటేజ్ పద్ధతే. లేకపోతే థియేటర్లు మూసివేయడం తప్పదు.” అని పేర్కొన్నారు..

 

ఈ మేరకు త్వరలో నిర్మాతలకు అధికారిక లేఖ రాసేందుకు కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు..

దీనికి గల కారణాలు కూడా చాలనే ఉన్నాయి..

సినిమాలు భారీ బడ్జెట్ తో నిర్మించడం..

సినిమా థియేటర్లో ఉండాగానే ఓటిటిలో సినిమాలు రిలీజ్ చేయడం..

 

ఈ నిర్ణయం అమలైతే జూన్ 1 నుంచి విడుదల కావాల్సిన సినిమాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా సినిమాలు విడుదలకు తీవ్ర సంకటంలో పడే అవకాశం ఉంది.

 

ప్రస్తుతం ఈ అంశం పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. నిర్మాతల సమాఖ్య, ఎగ్జిబిటర్ల మధ్య చర్చల ద్వారా సమర్థవంతమైన పరిష్కారం ఎప్పుడు, ఎలా లభించనుందో వేచి చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు