Search
Close this search box.

  క్రేజీ కాంబో సెట్ చేస్తున్న త్రివిక్రమ్..? ఇక బాక్సాఫీస్ బద్దలే..?

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాతో గత ఏడాది థియేటర్లో సందడి చేసారు.. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోయిన బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.. ఆ తర్వాత త్రివిక్రమ్ ఇప్పటి వరకు మరో సినిమా రాలేదు.. త్రివిక్రమ్ అల్లు అర్జున్‌తో సినిమా చేయాలనుకున్నప్పటికీ, స్క్రిప్ట్ పూర్తిగా కంప్లీట్ కాకపోవడంతో అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒకే చెప్పాడు..ఐతే ఇప్పుడు త్రివిక్రమ్ బన్నీ సినిమా స్క్రిప్ట్ కంప్లీట్ చేశాడట..కానీ బన్నీ అట్లీ తో సినిమా కంప్లీట్ అయ్యేసారికి కనీసం ఒక సంవత్సరం టైమ్ పడుతుంది.. అందుకనే త్రివిక్రమ్ వేరే స్క్రిప్ట్ పై ఫోకస్ పెట్టినట్లు సమాచారం..ఆ సినిమాలో హీరోగా విక్టరీ వెంకటేష్‌ నటించబోతున్నట్లు ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది.. జూలై నెల నుంచి వెంకటేష్‌తో సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఈ ప్రాజెక్ట్‌లో మరో స్టార్ ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నట్లు సమాచారం.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి..త్రివిక్రమ్, రామ్ చరణ్‌లు గతంలో సినిమా చేయాలని అనుకున్నప్పటికీ, అది అనేక కారణాల వల్ల వర్కౌట్ కాలేదు. అయితే ఈసారి ఈ కాంబినేషన్ రాబోవచ్చని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి… త్వరలోనే ఈ ఇద్దరి మధ్య ఒక కీలక సమావేశం జరగనుందని సమాచారం. త్రివిక్రమ్ చెప్పిన కథ రామ్ చరణ్‌కి నచ్చితే, ఈ ప్రాజెక్ట్ త్వరగా పట్టాలెక్కే అవకాశం ఉంది…ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది అనే భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం తేజస్ రగ్గడ్ లుక్‌లో చరణ్ కనిపిస్తున్నాడు. త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌తో ముందుకెళ్లాలంటే, ఆయన ‘పెద్ది’ డేట్స్‌ను ప్లాన్ చేయాల్సి వస్తుంది…ఈ సినిమా 2025 సంక్రాంతి రిలీజ్‌ను టార్గెట్ చేస్తున్నట్టు సమాచారం…ఈ భారీ ప్రాజెక్ట్‌ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనున్నట్లు టాక్ నడుస్తోంది…

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు