ఇటీవల కాలంలో భారతీయ ఇతిహాసాలపై సినిమాలు తీయడానికి దర్శకులు బాగా ఆసక్తి చూపుతున్నారు.. రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను ఆధారంగా తీసుకుని దర్శకులు గ్రాండ్ స్కేల్ పై సినిమా తెరకెక్కించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీటికి ప్రేక్షకుల నుంచి కూడా భారీ స్పందన వస్తోంది… ఈ సినిమాలకు వందల కోట్ల బడ్జెట్లు పెట్టడానికి నిర్మాతలు కూడా ముందుకు వస్తున్నారు.. ఈ సినిమాలు భారీ విజువల్స్ తో వెండి తెరపై గ్రాండ్ గా కనిపిస్తున్నాయి.. ఈ సినిమాలపై ప్రేక్షకుల కూడా ఆసక్తి చూపడంతో మైథాలజీ కథలతో భారీగా సినిమాలు తెరకెక్కుతున్నాయి.. ఈ ట్రెండ్‌లోనే బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారి దర్శకత్వంలో రూపొందుతోన్న “రామాయణ”చిత్రం దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పరుచుకుంది..ఈ సినిమాలో శ్రీ రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు… వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, పాత్రల లుక్స్ ఇప్పటికే నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రస్తుతం చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. ప్రతి రోజు ఓ కొత్త అప్డేట్తో చిత్రబృందం అభిమానులను ఉత్సాహపరుస్తోంది.ఐతే ఇప్పుడు ఈ సినిమాలో ఓ కీలక రోల్ కి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
తాజాగా ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఆమె రావణుడి భార్య మండోదరి పాత్రలో కనిపించనుందని సమాచారం. ఈ పాత్ర కోసం ఆమె లుక్ టెస్ట్ కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ టెస్ట్‌లో కాజల్ ఫిట్‌గా కనిపించడంతో చిత్రబృందం ఆమెను ఫైనల్ చేసిందని తెలుస్తోంది.ఈ చిత్రంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడి పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. కాగా, కాజల్ ఆయన భార్యగా నటించడం చిత్రానికి మరింత బలాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. యష్ ఇప్పటికే షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం. ఒకవేళ ఈ కాస్టింగ్ అధికారికంగా కన్ఫర్మ్ అయితే, రామ్ – సీత – రావణ – మండోదరి పాత్రలు అత్యంత శక్తివంతమైనవిగా నిలవబోతున్నాయి..దర్శకుడు నితేశ్ తివారీ ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు..“ఈ కథ 5000 సంవత్సరాలుగా కోట్లాదిమంది మనసుల్లో నిలిచింది. దాన్ని తెరపైకి తేవాలనే సంకల్పంతో గత పది ఏళ్లుగా మేము ఈ ప్రాజెక్ట్‌ను డెవలప్ చేస్తున్నాం” అని నమిత ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు…భారీ తారాగణం, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ రామాయణ సినిమా ఇండియన్ సినిమాకే ఓ గౌరవంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా కాజల్ అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్ ఎంట్రీ, యష్ – రణ్‌బీర్ – సాయి పల్లవిల పాత్రలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి..









