సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన సినిమా జైలర్’.. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ మళ్లీ మెగాఫోన్ పట్టిన ఈ సినిమాలో, వివిధ ఇండస్ట్రీల నుండి స్టార్ యాక్టర్లు ఈ సినిమాలో కామెయో రోల్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి… దాంతో ఈ సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది..ప్రస్తుతం సినిమా షూటింగ్ చెన్నైలో వేగంగా జరుగుతోంది… మొదటి పార్టులో మెరిసిన శివరాజ్ కుమార్ ,మోహన్ లాల్ ఈ సీక్వెల్ లోనూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసారి తెలుగు సింహం నందమూరి బాలకృష్ణ చేరడం, ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం, బాలకృష్ణ ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.. గతంలో ఆయన చేసిన రౌడీ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీ నరసింహా. తరహాలోనే మాస్ ఫుల్ ఎలివేషన్‌తో కూడిన పాత్ర ఇది అని టాక్… ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ లో రజినీ, బాలయ్యల మధ్య భారీ సన్నివేశాలు ఉండనున్నాయి. ఈ సీన్లకు ప్రత్యేకంగా తెలుగు మాస్ ఆడియెన్స్‌కు నచ్చే విధంగా ట్రీట్‌మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఇతర కీలక పాత్రల్లో రమ్యకృష్ణ, ఫహాద్ ఫాజిల్ కూడా నటిస్తున్నారు…ఇప్పటికే బాలకృష్ణ ఫ్యాన్స్ లో ఈ వార్తలు ఉత్సాహం పెంచాయి. మేకర్స్ త్వరలోనే బాలకృష్ణ లుక్‌ను విడుదల చేసి, ప్రాజెక్ట్‌కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ షేర్ చేయనున్నారు… సినిమా విడుదలకు ముందు ఈ మల్టీ-స్టారర్ సౌత్ లో భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేయనుంది..









