ఈ ఏడాది ‘డాకు మహారాజ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ, అదే జోష్‌లో ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ‘అఖండ 2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇటీవల హిమాలయాల్లో అఘోరా కాన్సెప్ట్ ఆధారంగా కీలక సన్నివేశాలు తెరకెక్కించారు…ఈ భారీ యాక్షన్ డ్రామాను దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌కి ఉన్న క్రేజ్ దృష్టిలో ఉంచుకుంటే, ఈ సినిమా పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి.‘అఖండ 2’ తర్వాత బాలయ్య నెక్స్ట్ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో జరగనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తై, బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.. ఇదే సమయంలో టాలీవుడ్లో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా రూపొందిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఆధిక్ రవిచంద్రన్, ఇటీవల బాలయ్యను కలిసి ఓ పవర్ఫుల్ మాస్ స్క్రిప్ట్ వినిపించినట్లు సమాచారం… అధిక్ చెప్పిన పాయింట్ బాలయ్యకు బాగా నచ్చిందట…
అజిత్‌కు తన ఫ్యాన్స్ ఎలాంటి మాస్ క్యారెక్టరైజేషన్ కోరుకుంటారో అద్భుతంగా అందించిన అధిక్, అదే స్థాయిలో బాలయ్యను చూపిస్తే మాస్ ఫీస్ట్ పక్కా అని అభిమానుల నమ్ముతున్నారు.. ఇందుకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈ భారీ ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు సమాచారం..
వరుసగా రెండు మాస్ సినిమాలతో బాలయ్య అభిమానులకు మరోసారి మాస్ ఫెస్టివల్ అని చెప్పాలి..అఖండ 2, గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్, అన్నీ సెట్ అయితే టాలీవుడ్లో బాలయ్య డబుల్ మాస్ డోస్‌కి సిద్ధమవుతున్నట్టే..!









