Search
Close this search box.

  రెబెల్స్ రెడీగా ఉండండి..? రాజాసాబ్ నుండి టీజర్ ..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన అభిమానులకు ఇచ్చిన మాట తెలిసిందే.. ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజ్ చేయాలన్నది ఆయన లక్ష్యం.. అందుకు తగ్గట్టే వరుసగా సినిమాలు చేస్తూ, ఫుల్ బిజీగా ఉంటున్నారు. గతేడాది ‘ఆది పురుష్’ తర్వాత సలార్’, ఆ తర్వాత కల్కి 2898 AD’ వంటి భారీ ప్రాజెక్ట్స్‌తో పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న డార్లింగ్ చేతిలో ఇప్పుడు ఆరు సినిమాలు ఉన్నాయి.

 

అందులో ముందు ప్రేక్షకుల ముందుకు రాబోయేది డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ మొదట్లో సైలెంట్‌గా ప్రారంభమైన ఈ సినిమా ఇటీవల లీక్ అయిన ఫోటోలు అఫీషియల్ పోస్టర్లు.. మోషన్ పోస్టర్ వంటివి హైప్‌ను గట్టిగా పెంచేశాయి.. ఈ సినిమా ఏప్రిల్ 10 రిలీజ్ కు ప్లాన్ చేసినప్పటికీ, అది వాయిదా పడిన తర్వాత ఏమీ అధికారిక సమాచారం లేదు. అదే సమయంలో అయితే తాజాగా డార్లింగ్ హైదరాబాద్‌కి తిరిగొచ్చారు. దీంతో చిత్రబృందం మళ్ళీ షూటింగ్ ప్రారంభించింది..

ప్రస్తుతం బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ప్రభాస్ కూడా షూటింగ్‌లో జాయిన్ అవ్వనున్నాడు. ఒకవైపు షూటింగ్ కొనసాగుతుండగా, మరోవైపు టీజర్ పని కూడా వేగంగా జరుగుతోంది. ప్రభాస్ డబ్బింగ్ చెప్పాక టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.ఈ సినిమాకి సంగీతాన్ని ఎస్. థమన్ అందిస్తున్నారు… ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.. మాళవిక మోహన్, నిధి అగర్వాల్ మరో హీరోయిన్ నటిస్తున్నట్లు సమాచారం.. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది…

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు