‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి బ్లాక్బస్టర్లతో లోకేష్ కనగరాజ్ తమిళ నాట సెన్సేషన్ డైరెక్టర్ గా మారిపోయాడు.. సీనియర్, యంగ్ హీరోలందరూ అతడి సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.. ప్రస్తుతం రజినీకాంత్‌తో కలిసి ‘కూలీ’ అనే మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తుండగా, తరువాత కార్తీతో ‘ఖైదీ 2’, కమల్ హాసన్‌తో ‘విక్రమ్ 2’, సూర్యతో ‘రోలెక్స్’ వంటి భారీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి.. “సినిమాటిక్ యూనివర్స్”. ఒకే ప్రపంచంలో పాత్రలు మల్టిపుల్ సినిమాల్లో కనెక్ట్ అవుతూ, ప్రేక్షకులను కొత్త అనుభవానికి తీసుకెళ్తున్నాడు. మాఫియా, డ్రగ్ నేపథ్యంలో కథలు ఉంటూనే, వాటిని బోర్ కొట్టకుండా ఎంగేజింగ్‌గా మలుస్తున్నాడు లోకేష్ ..ఇక ఇప్పుడు రజినీ కాంత్ హీరోగా, నటిస్తున్న కూలి సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమాచారం..ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది.. ఇందులో రజినీతో పాటు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతిహాసన్ వంటి స్టార్ నటులు ఉన్నారు. రజినీకి ఇది 171వ చిత్రం కావడం విశేషం.
ఇటీవలి ఇంటర్వ్యూలో లోకేష్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రజినీకాంత్, కమల్ హాసన్‌లను వయసు మళ్లిన గ్యాంగ్స్టర్లుగా చూపించే కథను ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్టు వెల్లడించాడు. అయితే, ఇరువురి మార్కెట్ విలువలు అధికంగా ఉండటంతో బడ్జెట్ కంట్రోల్ చేయడం సవాల్‌గా మారిందని చెప్పాడు. అయినా సరే, పరిస్థితులు అనుకూలిస్తే ఈ మల్టీస్టారర్ కచ్చితంగా తెరకెక్కిస్తానని హింట్ ఇచ్చాడు. ఈ ఇద్దరు కలిసి చివరిసారి 1985లో ‘గిరఫ్తార్’లో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరిని తెరపై చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. లోకేష్‌తో ఆ కల నెరవేరుతుందా..? చూడాలి మరి..









