Search
Close this search box.

  డ్రాగన్ లో సాహో బ్యూటీ..? ఈసారైనా..?

‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరింది. సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఎన్టీఆర్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం వార్ 2 లో ఓ కీలక రోల్ నటిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ ఫినిష్ అవ్వడంతో.. కెజీఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త సినిమా డ్రాగన్ మొదలు పెట్టాడు..ఈ సినిమా ఇప్పటికే పై భారీ అంచనాలు ఉన్నాయి..ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జోరుగా సాగుతుంది, అలాగే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి..ఈ సినిమా గురించి రోజుకో ఓ రూమర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇప్పుడు డ్రాగన్ సినిమా లో హీరోయిన్ గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది..

ఇప్పటికే రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.. అయితే తాజాగా మరో క్రేజీ న్యూస్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇందులో సెకండ్ హీరోయిన్ రోల్‌కి బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు, శ్రద్ధ పాత్ర ఈ సినిమాకు కీలకంగా ఉండబోతున్నట్లు సమాచారం… సెకండ్ హాఫ్‌లో ఆమె పాత్ర హైలైట్ అవుతుందని టాక్.ఇంకా అధికారిక ప్రకటన రాలేదుగానీ, ఈ వార్త ఫ్యాన్స్‌కి భారీ ఎక్స్‌పెక్టేషన్‌ను తీసుకొచ్చింది. ఒకవేళ ఇది నిజమైతే, ఎన్టీఆర్ – శ్రద్ధా కపూర్ జోడీ తెరపై అదిరిపోయే కెమిస్ట్రీను చూపించబోతోందని అభిమానులు ఎక్సైట్ అవుతున్నారు…ఇప్పటికే శ్రద్ధ కపూర్ ప్రభాస్ సరసన సాహో సినిమాలో నటించింది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు