డైరెక్టర్ అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు.. అనిల్ రావిపూడి.. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.. ఈ సినిమాలో వింటేజ్ మెగాస్టార్ కనిపించబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్నట్లు సమాచారం..ఈ సినిమాలో హీరోయిన్ గా నయన తార నటించబోతున్నట్లు సమాచారం..
ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి వంటి లెజెండరీ హీరోతో సినిమా చేస్తుండగా, మరోవైపు బాలకృష్ణతో మళ్లీ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. గతంలో అనిల్-బాలయ్య కాంబినేషన్‌లో భగవంత్ కేసరి అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఐతే వీరిద్దరూ కాంబో మరోసారి రిపీట్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ఈసారి బాలయ్య కొత్త లుక్, కొత్త డైలాగ్ డెలివరీ, ఉండబోతున్నట్లు సమాచారం.. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.. ఒకవేళ ఈ కాంబో నిజమైతే బాలయ్య ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి.. బాలయ్య ప్రస్తుతం అఖండ 2 తో బిజీగా ఉన్నారు.. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్టన్ లో సినిమా చేయబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి..









