అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం ఇండియా సినిమా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. విదేశాల్లో నిర్మించి, అమెరికాలో విడుదలయ్యే అన్ని రకాల సినిమాలపై..తక్షణమే 100 శాతం సుంకం విధించాలని ఆయన ఆదేశించారు.. ఈ విషయాన్ని ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో వెల్లడించారు..అమెరికన్ సినిమా పరిశ్రమకి ఇది ముప్పుగా మారిందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ దేశాలు తమ పరిశ్రమలకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తూ, అమెరికన్ ఫిలిం మేకర్లను ఆకర్షిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ చర్యలు హాలీవుడ్‌తో పాటు అమెరికా సినిమాల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ‘‘ఇది జాతీయ భద్రతకు ముప్పు’’ అని ట్రంప్ పేర్కొన్నాడు. ‘‘అమెరికాలో తయారైన సినిమాలకే మేం ప్రాధాన్యత ఇస్తాం’’ అని స్పష్టం చేశారు.అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లట్నిక్ కూడా ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని సోషల్ మీడియాలో వెల్లడించారు.
ప్రస్తుతం అమెరికాలో తెలుగు సినిమాలకు పెద్ద మార్కెట్ ఉంది. పలు సినిమాలు మిలియన్ డాలర్ క్లబ్‌లోకి చేరి భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. అయితే, తాజా సుంక విధానంతో.. పంపిణీదారులపై ఖర్చులు రెట్టింపు అవుతాయి..ఈ ఖర్చును టికెట్ ధరల రూపంలో ప్రేక్షకులపై మోపే అవకాశం ఉంది…టికెట్ ధరలు పెరగడంతో, థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది.. ఇది బాక్సాఫీస్ వసూళ్లపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అని నిపుణులు అంచనాలు వేస్తున్నారు..పెద్ద బడ్జెట్, స్టార్ హీరోల సినిమాలు ఈ భారాన్ని మోయగలవు..కానీ చిన్న, మధ్యస్థాయి సినిమాల అమెరికా రిలీజ్ అనుమానాస్పదమవుతుంది… డిస్ట్రిబ్యూటర్లు సినిమాల కొనుగోలు విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించవచ్చు… చూడాలి మరి ఈ ట్రంప్ టాక్స్ తెలుగు సినిమాలపై ఎంత ప్రభావం చూపుతుందో..









