Search
Close this search box.

  హిట్ పెయిర్ రిపీట్..? డార్లింగ్ సరసన మరోసారి స్వీటీ..? ఫ్యాన్స్ కు పండగే.,?

తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోయే హిట్ పెయిర్ లో ప్రభాస్ – అనుష్క కాంబినేషన్ ఒకటి. బిల్ల, మిర్చి,,బాహుబలి సిరీస్ సినిమాలు ఉన్నాయి.. సినిమాల్లో ఈ జంట కెమిస్ట్రీ అంతా ఇంతా కాదు. తెరపై ఈ ఇద్దరిని చూసిన ప్రతిసారీ అభిమానులకు కన్నుల పండగే అని చెప్పాలి.. ఆన్ స్క్రీన్ యే కాదు .. ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరిద్దరూ జంట కాబోతున్నారన్న ప్రచారం ఎక్కువసార్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది…ప్రస్తుతం ప్రభాస్ వయసు 45, అనుష్క 43. ఇద్దరూ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో ఈ జంటపై గాసిప్స్ ఎప్పటికప్పుడు ఊపందుకుంటూనే ఉన్నాయి. నిశ్చితార్థం అయిపోయిందని, జాతకాలు కలవకపోవడం వల్ల పెళ్లి ఆగిపోయిందన్న వార్తలూ వినిపించాయి. కానీ వాటిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.. ఐతే ప్రస్తుతం వీళ్లిద్దరి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అసలు మ్యాటర్ ఏంటంటే..! ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న స్పిరిట్ సినిమాలో ప్రభాస్ హీరోగా , పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు… ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను లీడ్ హీరోయిన్‌గా తీసుకునే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ జంట ‘కల్కి 2898 A.D.’లో కూడా కనబడింది.. ఐతే మరోసారి సందీప్ రెడ్డి, ప్రభాస్ సినిమాలో కూడా హీరోయిన్ గా దీపిక ఫిక్స్ అయినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి..

ఇక స్పిరిట్ లో రెండో హీరోయిన్ పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం.. సందీప్ రెడ్డి వంగా ప్రతి సినిమాలో ఇద్దరూ హీరోయిన్లు ఉంటారు. అర్జును రెడ్డి, అనిమల్ సినిమాలో కూడా ఉన్నారు.. సెకండ్ హీరోయిన్ పాత్రను సెకండ్ హాఫ్ లో రెవీల్ చేస్తాడు.. ఈసారి కూడా సందీప్ అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లు సమాచరం.. ఆ పాత్ర కథలో కీలక మలుపు తిప్పే రీతిలో ఉండనుండటంతో, అనుష్కని ఆ పాత్ర కోసం సంప్రదిస్తున్నట్టు సమాచారం. ఇది నిజమైతే, బాహుబలి 2 తర్వాత ప్రభాస్ – అనుష్క జంట మళ్లీ తెరపై కనిపిస్తారు..ప్రభాస్ – అనుష్క మళ్లీ ఒక్కసారిగా తెరపై దర్శనమిస్తే అది ఫ్యాన్స్‌కి పండగే అని చెప్పాలి అనుభూతి కానుంది. స్పిరిట్ లో ఈ కాంబోను మళ్లీ చూడబోతున్నామా? అన్నదానిపై అధికారిక ప్రకటన కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు