Search
Close this search box.

  క్రేజీ కాంబో రిపీట్..! రౌడీకి జోడీగా రష్మిక..!

ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో, విజయ్ దేవరకొండ – జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందుతున్న “కింగ్డమ్” ఒకటి. ఈ సినిమా ఇప్పటికే బజ్ క్రియేట్ చేస్తుండగా, విజయ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ ను టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తో కలిసి చేయనున్నాడు.. ఇప్పటికే వీరిద్దరూ కాంబో లో ట్యాక్సీవాలా’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్‌లో మరో భారీ సినిమా రూపొందనుంది. ఈ సినిమాపై కూడా ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.. ఇక ఈ సినిమా సంబంధించినా ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది… ఈ సినిమాలో హీరోయిన్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తీసుకున్నట్లు సమాచారం.. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌తో పాటు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చిన లేటెస్ట్ హింట్స్ ప్రకారం, రష్మిక ప్రాజెక్ట్‌లో భాగమైన విషయం దాదాపుగా ఖరారైంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది..విజయ్–రష్మిక జోడీ ఇప్పటికే పలు సినిమాల్లో నటించారు.. గీత గోవిందం, డియర్ కామ్రేడ్, వంటి సినిమాలో నటించి అభిమానులను మెప్పించారు.. వీళ్ల జోడీ పై ఆన్ స్క్రీన్ పై కాకుండా, ఆఫ్ స్క్రీన్ పై కూడా బాగా రూమర్స్ వస్తుంటాయి..మళ్లీ వీరిద్దరూ కలిసి నటిస్తుండడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు