Search
Close this search box.

  ప్రభాస్ స్పిరిట్ నుండి క్రేజీ అప్డేట్..! ఇక ప్రభాస్ ఫాన్స్ కు పండగే..!

‘యానిమల్’ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ ను ప్రభాస్ తో చేస్తున్నట్లు ప్రకటించాడు.. ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు.. ఐతే ఈ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు కూడా హింట్ ఇచ్చాడు సందీప్.. ఐతే ఈ సినిమా ఇన్ని రోజులైనా సెట్స్ పైకి మాత్రం వెళ్ళలేదు.. దీని తర్వాత ప్రభాస్ హను రాఘవపూడి కాంబోలో ప్రకటించిన ఫౌజీ సినిమా కూడా ఆల్రెడీ షూటింగ్ దశలో ఉందీ కానీ సందీప్ ప్రభాస్ కాంబో మాత్రం సెట్స్ పైకి వెళ్లలేదు.. కానీ ఇప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన లొకేషన్, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో స్పిరిట్ టీమ్ ఉన్నారు.. అయితే ప్రభాస్‌ ఇతర ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఈ సినిమా ప్రారంభం ఆలస్యమైంది. ప్రస్తుతం ఇటలీలో విశ్రాంతి తీసుకుంటున్న ప్రభాస్, ఈ నెలలో హైదరాబాద్‌కి తిరిగి వచ్చి ‘ది రాజా సాబ్’ షూటింగ్‌ను పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత వెంటనే ‘స్పిరిట్’ షూటింగ్ ప్రారంభం కానుంది.

 

ఇప్పటికే ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర అప్‌డేట్లు బయటకు వచ్చాయి. ముఖ్యంగా హీరోయిన్‌గా దీపికా పదుకొణే ఎంపికయ్యే అవకాశముందని, ఆమెతో ఒప్పందం కుదిరినట్టుగా వార్తలు వస్తున్నాయి. ‘కల్కి 2898 AD’లో జోడీగా కనిపించిన ప్రభాస్-దీపిక, ఇప్పుడు ‘కల్కి 2’లో కూడా కలిసి నటించనున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘స్పిరిట్’లో కూడా ఈ జోడీ కనబడితే, సినిమాపై బజ్ మరింత పెరగడం ఖాయం.. చివరగా, కొన్ని ఆలస్యాలపై వచ్చిన వార్తలపై నిర్మాత భూషణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ‘స్పిరిట్’ కంటే ముందు ‘యానిమల్ పార్క్’ సినిమా రావడంలేదని స్పష్టం చేశారు. ఇంకా 2-3 నెలల్లో షూటింగ్ ప్రారంభమవుతుందని, సినిమాను 2027లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు