సక్సెస్‌ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా గుర్తింపు పొందిన హిట్’ సిరీస్ త్వరలోనే నాలుగో పార్ట్ ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా హిట్ 3’ గురువారం థియేటర్లలో విడుదలై మంచి పాజిటివ్ టాక్‌ను అందుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్ కొలను.. నాని తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా తెరకెక్కించారు… ప్రతి పార్ట్ లో ఓ కొత్త హీరో పరిచయం చేస్తూ, క్లైమాక్స్‌లో తరువాతి పార్ట్ కోసం హింట్ ఇస్తున్న దర్శకుడు, ఈసారి కూడా అదే ఫార్మాట్‌ను కంటిన్యూ చేసాడు.. హిట్ ఫస్ట్ పార్ట్ లో హీరోగా విశ్వక్ సేన్ నటించాడు.. ఆ తరువాత హిట్ ది సెకండ్ కేసు పేరుతో వచ్చిన పార్ట్ లో హీరోగా అడివిశేష్ నటించాడు.. ఐతే హిట్ 2 క్లైమాక్స్ లో నాని ఎంట్రీ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చాడు డైరెక్టర్ శైలేష్ .. ఇప్పుడు హిట్ 3 లో కూడా సేమ్ అదే ఫార్మాట్ లో తమిళ స్టార్ హీరో కార్తీ ఎంట్రీ ఇచ్చాడు.. ఐతే హిట్ సిరీస్ కంటిన్యూ పార్ట్ ఉంది.. అలాగే అందులో కార్తి హీరో అని సమాచారం.. ఐతే హిట్ సిరీస్ మొత్తం 8 పార్ట్స్ గా ఉండబోతుంది అని సమాచారం.. చివరి సిరీస్ లో అందరూ హీరోలు కనిపించబోతున్నట్లు సమాచారం.. ఇక హిట్ 3 క్లైమాక్స్ లో వీరప్పన్ పాత్రలో కార్తీ ఎంట్రీ ఇచ్చారు. ఆయనే హిట్ 4 హీరోగా కొనసాగనున్నారు. ఇప్పటికే కార్తీ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించినట్టు సమాచారం…









