పహల్గాం ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించే విషాద ఘటనగా మారింది. ఈ దుర్ఘటన నేపథ్యంలో పాకిస్తాన్ పై ఇప్పటికే ఉన్న ఆగ్రహానికి తోడు, భారత సినీ పరిశ్రమలో పాకిస్తాన్ మూలాలు ఉన్న నటులపై కూడా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ – హను రాఘవపూడి సినిమా సంబంధించి హీరోయిన్ ఇమాన్వీపై సోషల్ మీడియాలో వేదికగా తెగ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు.. తన పై వస్తున్న ఆరోపణలపై ఇమాన్వీ స్పందించింది..తన కుటుంబానికి పాకిస్తాన్ మిలిటరీతో ఎలాంటి సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పింది.సోషల్ మీడియా ప్రచారం తన గురించి తప్పుడు సమాచారం వైరల్ అవుతున్నదని పేర్కొంది. ముఖ్యంగా మీడియా ప్రతినిధులు నిజాన్ని తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాన్ని ఫాలో అవడం తనకు బాధ కలిగిస్తోందని తెలిపింది.
తన నేపథ్యం తాను అమెరికాలో పెరిగిన భారత మూలాల యువతి అని, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలను ఎంతో గౌరవంగా స్వీకరిస్తానని తెలిపింది.
తన దేశభక్తి తాను Proud Indian-American అని చెప్పి, దేశం పట్ల ఉన్న గౌరవాన్ని వ్యక్తం చేసింది.. మరి ఈ విషయం పై నెటిజన్స్ మళ్ళీ ఎలా స్పందిస్తారో చూడాలి..