Search
Close this search box.

  విరూపాక్ష 2 లో బచ్చన్ బ్యూటీ..?

సాయిధరమ్ తేజ్ హీరోగా డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన విరూపాక్ష సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే.. ఐతే ప్రస్తుతం సీక్వెల్ ట్రెండ్ నడుస్తుంది.. బ్లాక్ బస్టర్ సినిమాలకు తెస్తున్నారు.. ఐతే విరూపాక్ష. సినిమాకు కూడా సీక్వెల్ ఉండబోతుందని డైరెక్టర్ కార్తీక్ దండు సినిమా చివర్లో ఓ హింట్ ఇచ్చారు.. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెంచబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది..అలాగే విరూపాక్ష 2 అఫీషియల్ గా రాబోతున్నదంటే, అది మిస్టికల్ థ్రిల్లర్ జానర్ ని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుందని తెలుస్తుంది… ఇక సినిమాలో హీరోయిన్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం.. ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటించబోతున్నట్లు సమాచారం.. ఈ వార్త నిజమైతే, అది ఆమె కెరియర్ కి గేమ్ ఛేంజర్ కావొచ్చు. మిస్టర్ బచ్చన్ లో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం, ఆ స్టెప్పే ఆమెపై ఉన్న డెడికేషన్ ని చూపిస్తుంది.ఇదిలా ఉంటే, నెట్టింటా విరూపాక్ష 2 గురించి వస్తున్న హైప్ చూస్తుంటే, ఇది మరో విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కార్తీక్ వర్మ దండు, సుకుమార్, బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ల కలయిక చూస్తేనే ఆసక్తి పెరిగిపోతోంది…

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు