ప్రభాస్ మార్కెట్, క్రేజ్ ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ గా ఎంతవరకు ఎదిగారో చూస్తుంటే, ఆయన నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ అంటే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజమే.
దర్శకుడు మారుతి ఫన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్. అలాంటి డైరెక్టర్ తో కలిసి ప్రభాస్ చేస్తుండడం అంటే ఇది పూర్తిగా కొత్త జానర్ ట్రై చేయడం అనేలా ఉంది. “ది రాజా సాబ్” అనే టైటిల్ వింటేనే ఓ మాస్ + ఫ్యామిలీ టచ్ కలిగిన సినిమాలా అనిపిస్తుంది.అయితే ఈ సినిమా నుండి వచ్చిన గ్లింప్స్ ప్రభాస్ లుక్ అదిరిపోయిందని వింటేజ్ ప్రభాస్ బ్యాక్ అని ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీ గా ఫీల్ అయ్యారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం.. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ మే నుండి మొదలు పెట్టే ఆలోచలో రాజాసాబ్ టీమ్ ఉన్నట్లు తెలుస్తుంది..ముందుగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తారని ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది..ఐతే ఈ సినిమా నుండి డైరెక్టర్ మారుతి ఎట్టకేలకు ఓ అప్డేట్ ఇచ్చాడు..
మేలో వేడి గాలులు పెరగనున్నాయి అని మారుతి చెప్పిన వ్యాఖ్యతో చూస్తుంటే, మే లో కొత్త రిలీజ్ డేట్, లేదా మోషన్ పోస్టర్ / టీజర్ రానుందన్న టాక్ స్పష్టమవుతోంది. ప్రభాస్ ఫోటో ఓ ఆటో మీద ఉంచడం కూడా సినిమాకి ఉండే మాస్ రూట్ స్టైల్ ని ఇమిడ్చేలా ఉంది.









