గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చి బాబు దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా మూవీ పెద్ది.. ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. బుచ్చిబాబు సానా కి ‘ఉప్పెన’ తర్వాత వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. అందులో కూడా రామ్ చరణ్ – జాన్వీ కపూర్ కాంబినేషన్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్ ఉండడంతో ఈ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ లో భారీ హైప్ క్రియేట్ అయింది..ఐతే ఈ సినిమా నుండి ఉగాది రోజు రిలీజ్ అయిన గ్లింప్స్ భారీ వ్యూస్ దక్కించుకొని రికార్డు క్రియేట్ చేసింది.. ఈ గింప్స్ లో చివరి షాట్ రామ్ చరణ్ బ్యాట్ తో బాల్ కొట్టిన తీరు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.. ఐతే ఈ సినిమా మరో స్టార్ హీరో క్యామియో రోల్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి..కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గెస్ట్ అప్పీరియెన్స్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.. దీంతో ఈ సినిమా పై మరింత హైప్ పెరిగింది..సూర్య విషయానికి వస్తే, “రోలెక్స్” గా విక్రమ్ సినిమాలో పాత్రతో ఒక్కసారి స్క్రీన్‌కి వచ్చి ఏ స్థాయిలో హవా చూపారో మనమందరికి తెలుసు. అలాంటిది పెద్ది లాంటి స్పోర్ట్స్ డ్రామాలో అతను చేస్తే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.. ఐతే ఈ సీన్ ఓ ఫ్లాష్‌బ్యాక్ లో వచ్చే ఇంటెన్స్ కీ రోల్ అయి ఉండొచ్చు అని సమాచారం..రామ్ చరణ్ – సూర్య ఇద్దరు స్క్రీన్ మీద ఒక్కసారైనా కనిపిస్తే, అది ఫ్యాన్స్‌కి ఊహించలేని ఫీస్ట్ అవుతుంది. ముఖ్యంగా ఎమోషన్, ఇన్స్పిరేషన్ తో కూడిన పాత్రల్లో సూర్య గుండెకు హత్తుకునేలా నటిస్తారు. అలాంటి ఒక్క సీన్ కే అయినా అతను పెర్ఫార్మ్ చేస్తే, ఆ సీన్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.ఈ న్యూస్ పెద్ది టీమ్ అధికారాక ప్రకటన ఇచ్చేదకా వేచి చూడాల్సిందే..!









