‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ మాస్ అవతార్ లో, ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్ చెప్పడమే కాకుండా, క్రికెట్ బ్యాక్‌డ్రాప్ తో కూడిన రురల్ స్పోర్ట్స్ డ్రామా అంటేనే కిక్ ఎక్కుతుంది… జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్ దేవేంద్ర శర్మ లాంటి భారీ స్టార్ కాస్ట్ తో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్ తో ఉంది..ఈ సినిమాకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందిగా ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్—ఇది సినిమాను నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెతుల్తుందాని డైరెక్టర్ బుచ్చిబాబు చాలా కాన్ఫిడెంట్ గా నమ్ముతున్నాడు.. ఈ సినిమా గురించి బుచ్చిబాబు ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు చెప్పాడు… మొదట పెద్ది స్టోరీ కంప్లీట్ అయ్యాక బుచ్చిబాబు సుకుమార్ కి చెప్పగా స్టోరీ బావుందని చెప్పి , ఈ స్టోరీకి చరణ్ బాగా సూట్ అవుతాడని చెప్పాడట.. అప్పుడు బుచ్చిబాబు వెంటనే రామ్ చరణ్ కు ఈ స్టోరీ చెప్పగా.. చరణ్ స్టోరీ బాగా నచ్చింది అని చెప్పాడట.. అప్పటి నుండి ఈ పెద్ది ప్రయాణం మొదలైంది అని బుచ్చిబాబు అన్నాడు..చిరంజీవి గారు ఫస్ట్ గ్లింప్స్ చూసి ఎగ్జైట్ అవ్వడం, చరణ్ లుక్ పై ఆయన ఇచ్చిన స్పందన బుచ్చిబాబుకే కాదు, అభిమానులకూ మంచి బూస్ట్ ఇచ్చింది.









