Search
Close this search box.

  బాలీవుడ్ రామాయణం రిలీజ్ డేట్ ఫిక్స్..? ఎప్పుడంటే..?

బాలీవుడ్ లో రామాయణం తెరకెక్కిస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు.. కొన్ని రోజుల పాటు షూటింగ్ కూడా జరిగింది.. కొన్ని షూటింగ్ ఫొటోలో కూడా లీక్ అయ్యాయి.. అప్పటి నుండి బాలీవుడ్ లో తెరకెక్కే రామాయణం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి..

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ తో పాటు భారీ స్టార్ కాస్ట్ కూడా ఉంది.. ఈ రామాయణంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించడం ఈ రామాయణం క్రేజీ భారీగా పెరిగింది… ఈ కాంబినేషన్‌తో పాటు బాబీ డియోల్, రకుల్ ప్రీత్ లాంటి నటులు ఉండటంతో ప్రాజెక్ట్‌కి పాన్-ఇండియా లెవెల్లో ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.. ‘ఆదిపురుష్’ విషయంలో వచ్చిన విమర్శల తర్వాత, ఈసారి మేకర్స్ మరింత జాగ్రత్తగా, భక్తిభావాన్ని కాపాడుతూ చాలా ప్రతిష్టాత్మకంగా హై వాల్యూస్ తో భారీ వి ఎఫ్ క్స్ తో చాలా గ్రాండియర్ గా తెరకెకుతున్నట్లు సమాచారం.. అయితే ఈ సినిమా నుండి ఓ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. చూడాలి ఈ రామాయణం ఎలాంటి విజువల్స్ తో వస్తుందో..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు