Search
Close this search box.

  బాలీవుడ్ స్టార్ తో రామ్ గోపాల్ వర్మ హార్రర్ సినిమా..!

రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ లలో ఒకరిగా పేరు ఉన్నా ఈ దర్శకుడు ప్రస్తుతం మాత్రం ఏవో చిన్న సినిమాలు చేస్తూ ఉన్నాడు.. టాలీవుడ్ టూ బాలీవుడ్ శివ,సర్కార్ లాంటి క్లాసిక్ సినిమాలను అందించినా ఈ దర్శకుడు.. ఇప్పుడు మాత్రం అటువంటి సినిమాలు తీసి చాలా రోజులు అయింది..ఇప్పుడు మరోసారి ఈ దర్శకుడు మరోసారి ఒక కొత్త సినిమాను ప్రకటించాడు.. ఒకప్పుడు భయాన్ని మిక్స్ చేసిన మాస్టర్. రాత్రి, దెయ్యం, భూత్, కౌన్ లాంటి సినిమాలతో హర్రర్‌లో వర్మకి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆయన తీసిన సినిమాలు పెద్దగా మెప్పించలేకపోయాయి. ప్రాజెక్ట్‌లు అనౌన్స్ చేయడం మామూలే… కానీ అవి మొదలవ్వడం మాత్రం అరుదే..

 

ఇప్పుడీ నేపథ్యంలో వర్మ మరోసారి హర్రర్ జానర్‌తో రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. తాజా అనౌన్స్‌మెంట్ ప్రకారం కొత్త సినిమా పేరు – “పోలీస్ స్టేషన్ మే భూత్”.. ఇక ఈ సినిమా ట్యాగ్‌లైన్ కూడా కాస్త ఆసక్తికరంగానే ఉంది – “మీరు చనిపోయిన వారిని చంపలేరు”.. “మనమంతా భయపడితే పోలీస్ స్టేషన్‌కి వెళ్తాం. కానీ పోలీసులే భయపడితే ఎక్కడికి వెళ్తారు?” ఈ సినిమా కూడా ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీతో రాబోతున్నట్లు సమాచారం.. ఓ ఘోరమైన ఎన్‌కౌంటర్ తర్వాత ఓ పోలీస్ స్టేషన్ దెయ్యాల స్థలంగా మారుతుంది. ఆ స్టేషన్‌లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్స్‌కి ఆత్మలు తిరుగుతుంటాయి. భయంతో పోలీసులు అక్కడినుంచి పారిపోతుంటారు.. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ మనోజ్ బాజ్‌పేయ్ ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు. ఇంతకుముందూ వర్మతో ఆయన మంచి సినిమాలు చేశారనే సంగతి తెలిసిందే. అందుకే ఈ కాంబోపై ఇంకాస్త ఇంట్రెస్ట్ పెరిగింది…ఇప్పటికే వర్మ తానేంటో మళ్లీ ప్రూవ్ చేసుకుంటానని మాటిచ్చాడు.. ఈ “పోలీస్ స్టేషన్ మే భూత్”తో ఆ మాట నిలబెట్టుకుంటాడా..? లేక మళ్లీ అదే పాత రూట్‌లోకి పోతాడా అన్నది చూడాలి.

.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు