Search
Close this search box.

  రవితేజ “మాస్ జాతర” మొదలు..!

మాస్ మహారాజా రవితేజ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. టైగర్ నాగేశ్వరరావు ,ఈగల్ రీసెంట్ గా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విధంగా విజయాన్ని సాధించేలేవు.. కానీ రవితేజ మాత్రం ఎప్పటిలాగే ఎనర్జీ వదలకుండా… మరోసారి పక్కా మాస్ మూవీతో రెడీ అయ్యాడు..డైరెక్టర్ భాను బోగవరపు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌కి – “మాస్ జాతర” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. పేరు లోనే ఒక మాస్ ఫీలింగ్ రావడంతో ఈ సినిమా పై ఆడియన్స్ లో భారీ హైప్ ఉంది.. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ –సాయి సౌజన్య నిర్మిస్తున్నారు…ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల మరోసారి హీరోయిన్ గా నటిస్తోంది… ఇప్పటికీ ధమాకాలో వీళ్ళ ఎనర్జీ చూసి ఆడియెన్స్ ఫిదా అయ్యారు.. మరోసారి స్క్రీన్ మీద వీరి జోడీ అంటే మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు – ఫుల్ ఫైర్. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ “టూ మేరా లవర్” ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. మాస్ బీట్ మాస్టర్ భీమ్స్ సిసిరోలియో ఈ పాటకు ట్యూన్స్ అందించాడు.., ఇప్పటికే రిలీజైన టైటిల్, పోస్టర్స్ సినిమాపై బజ్‌ను రెట్టింపు చేస్తున్నాయి. “మాస్ జాతర” అనే టైటిల్‌కు తగినట్టే – రవితేజ ఈసారి తన 75వ సినిమాతో మళ్లీ మాస్ గోల చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. చూడాలి మరి ఈ సినిమా థియేటర్లో ఎలాంటి మాస్ గోలా చేస్తుంది..!

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు