గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఇప్పుడు మళ్ళీ కమ్ బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈసారి ఆయన తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా, సినిమా చేయబోతున్నాడు.. ఈ సినిమాను ఛార్మీ,పూరి కౌర్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.ఇప్పటి వరకూ ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో పలురకాల ఊహాగానాలు వినిపించాయి.. హీరోయిన్ గా టబూ లేక రవీనా టాండన్ అనే చర్చ సోషల్ మీడియాలో తెగ జరిగింది.. చివరికి క్లారిటీ వచ్చేసింది. అధికారికంగా టబూనే ఫిక్స్ అయ్యింది..! పూరి, ఛార్మీ, టబూ ముగ్గురు కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ – టబూ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారు పూరీ జగన్నాథ్… టబూ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుందనే టాక్ హాట్‌గా వైరల్ అవుతోంది.. .పూరి చెప్పిన స్టోరీ లైన్ వినగానే విజయ్ సేతుపతి బాగా ఎక్సైట్ అయ్యాడట. “ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారో” అని వెయిట్ చేస్తున్నట్లు సమాచారం… ఇది వరకు డిజాస్టర్ అనిపించుకున్న ‘లైగర్’ తర్వాత పూరికి ఇది చాలా కీలక ప్రాజెక్ట్ గా మారబోతోంది… ఈ సినిమా పై పూరీ జగన్నాథ్ ఫ్యూచర్ ఆధారపడి ఉంది..సేతుపతి – టబూ లాంటి స్ట్రాంగ్ క్యాస్టింగ్‌తో ఈ సినిమాతో మళ్ళీ పూరి తన మ్యాజిక్ రిపీట్ చేస్తాడని ఆడియెన్స్ నమ్ముతున్నారు.. చూడాలి మరి పూరి జగన్నాథ్ ఈ సినిమాతో కమ్ బ్యాక్ అవుతారో లేదో..!









