Search
Close this search box.

  3 పార్ట్స్ గా “జాక్”..! టైటిల్స్ కూడా ఫిక్స్..!

తెలుగు సినిమాల్లో సీక్వెల్ ట్రెండ్ హవా కొనసాగుతుంది.. . ఒక్క సినిమా హిట్ అయితే, దాన్ని సిరీస్‌గా మార్చేయడం ట్రెండ్ అయిపోయింది.. ఇప్పుడు అదే రూట్‌లోకి వెళ్తున్నాడు మరో హీరో & డైరెక్టర్.. సిద్దు జొన్నల గడ్డ, వైష్ణవి జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా “జాక్”.. ఈ సినిమా నుండి రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. అయితే ఈ సినిమా మరో కొన్ని రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉంది.. ఈ జాక్’ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ అవుతోంది..అయితే ఈ సినిమా నుండి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఈ సినిమాకి సీక్వెల్స్ ఉండబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమా మొత్తం మూడు పార్ట్స్ గా ప్లాన్ చేస్తున్నారట.. . ‘జాక్’, ‘జాక్ ప్రో’, ‘జాక్ ప్రో మ్యాక్స్’ అని మూడు పార్ట్ ల కథ రెడీ చేశారట బొమ్మరిల్లు భాస్కర్… ఆ సంగతినీ ఇటీవలే ఆయనే ఓ ఇంటర్వ్యూలో క్లారిటీగా చెప్పేశారు… ఈ సినిమాలో హీరోగా సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్నాడు. రొటీన్‌గా కామెడీ, బూతు డైలాగులతో అలరిస్తున్న సిద్ధు… ఇప్పుడు డిఫరెంట్ గెటప్‌లో కనిపించబోతున్నాడు. డ్రగ్స్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో జాక్ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది.. ఐతే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ రిజల్ట్ బట్టి మిగతా పార్ట్స్ తీసే ఛాన్స్ ఉంటుందని సమాచారం..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు