మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు.. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది.. ఇక మెగాస్టార్ మిగతా సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు.. అయితే మెగాస్టార్ వరుసగా యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలకు కమిట్ అయ్యాడు… ఆ సినిమాలలో మోస్ట్ అవైటెడ్ కాంబో వస్తున్న సినిమా..ఓదెల శ్రీకాంత్ డైరెక్షన్లో వస్తున్న సినిమా పై భారీ హైప్ ఉంది.. ఈ సినిమాను నాని నిర్మిస్తుండటంతో ఈ సినిమా పై మరింత హైప్ పెరిగింది.. ఐతే ఈ సినిమా గురించి నాని చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో, నాని ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
“చిరంజీవి గారు అనగానే.. డాన్స్, యాక్షన్ మాత్రమే అని ఒక అభిప్రాయం ఏర్పడింది. కానీ మెగాస్టార్ అంటే అంతకంటే ఎక్కువ. కానీ, ఇప్పుడు ఆ కోణాన్ని మర్చిపోయి, వేరే దానిపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాం. శ్రీకాంత్ ఓదెల – చిరంజీవి కాంబినేషన్ చాలా ఇంట్రెస్టింగ్. ఈ ప్రాజెక్ట్ను నిర్మించడం నా అదృష్టంగా భావిస్తున్నా.” అని నాని చెప్పారు…
నాని మాటలు విన్న మెగా ఫుల్ ఖుషీ అవుతున్నారు.. మెగాస్టార్ మళ్ళీ వింటేజ్ లుక్ లో కనబడపోతున్నారు అని తెలుస్తుంది.. చిరు గత సినిమాల కన్నా ఈ సినిమా స్పెషల్ గా ఉండబోతుందని సమాచారం..









