Search
Close this search box.

  జోడి రిపీట్..! ప్రభాస్ కు జోడిగా దిశా పటాని..!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు… ఇప్పటికే ఆయన రాజాసాబ్ అనే హర్రర్ జోనర్ మూవీలో నటిస్తూ, మరోవైపు సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ లవ్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది.. ఇప్పటికే పలు కీలక సన్నివేశాలు పూర్తి అయినట్లు సమాచారం.. ఐతే ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి.. ఈ. సినిమా పీరియాడిక్ ఎపిక్ లవ్ డ్రామాగా రాబోతుందని అందరికి తెలిసిందే.. ఈ సినిమాలో ఇప్పటికే ప్రభాస్ జోడీగా ఇమాన్వి హీరోయిన్ గా తీసుకున్నారు.. ఐతే ఇమాన్వి పాత్ర కొంత సేపు మాత్రమే ఉంటుందని సమాచారం..ఈ సినిమాలో మరో మెయిన్ హీరోయిన్ పాత్ర కోసం బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది.. మెయిన్ హీరోయిన్ గా దిశా పటానిని తీసుకున్నట్లు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఇప్పటికే మేకర్స్ ఆమెతో సంప్రదింపులు పూర్తి చేసుకుని, గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది…ప్రభాస్, దిశా పటాని ఇప్పటికే ‘కల్కి 2898 AD’లో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వీరి కాంబినేషన్ తో , ఈ ప్రాజెక్ట్‌పై మరింత హైప్ పెరిగింది..ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.. 2026లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టాలీవుడ్‌లో మరో సెన్సేషన్ క్రియేట్ చేయనున్నట్టు సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు